టిన్ డబ్బాలో తల ఇరుక్కోవడంతో ఎటూ కదలలేక ఉన్న హిమాలయన్ ఎలుగుబంటిని భారత్ ఆర్మీ బలగాలు రక్షించాయి. ఇటీవల జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో తాజాగా వైరల్ అవుతోంది. లొకేషన్ వివరాలు తెలియకున్నా హిమాలయ పర్వత శ్రేణిలో ఎలుగుబంటి తిరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న బలగాలు దీన్ని రెస్క్యూ చేశాయి. తాళ్లతో చుట్టి క్యాంప్ దగ్గిరికి తీసుకెళ్లారు. అక్కడ సురక్షితంగా డబ్బాను తొలగించి వదిలేశారు.