తమిళనాడులోని కోయంబత్తూరులో ఆసక్తికర ఘటన జరిగింది. తిప్పనూర్ గ్రామంలోకి ఏనుగులు ప్రవేశించి గందరగోళం సృష్టించాయి. ఈక్రమంలో ఓ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. గుమ్మం ముందు గజరాజు నిల్చొని ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి చేతులెత్తి మొక్కుతూ ప్రార్థనలు చేశారు. 'వెళ్లిపో గణేషా' అంటూ వేడుకోవడంతో ఏనుగు తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియో వైరలవుతోంది.