మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ గొడవలపై ఇంత వరకు మీడియాతో మాట్లాడని మోహన్ బాబు రేపు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు. మంగళవారం జరిగిన గొడవల్లో గాయపడిన ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలోనే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మాట్లాడనుండడంతో ఆయన ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది.