అమెరికాలో 22 అంతస్తుల టవర్ సెకన్లలో కూల్చివేత

79చూసినవారు
అమెరికాలో 22 అంతస్తుల టవర్ సెకన్లలో కూల్చివేత
అమెరికాలో 22 అంతస్తుల టవర్ ను సెకన్ల వ్యవధిలో కూల్చివేశారు. లూసియానా రాష్ట్రంలోని లేక్ చార్లెస్లో పాడుబడిన హెరిటేజ్ టవర్ ఉంది. అక్కడ హరికేన్ల కారణంగా దెబ్బతినడంతో ఈ టవర్ ను అధికారులు కూల్చివేశారు. కూల్చివేత సమయంలో భవనంలోపల వరుస పేలుళ్లు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. 2020లో నైరుతి లూసియానాలో వచ్చిన వరుస తుపానుల కారణంగా ఈ భవనం దెబ్బతింది. మరమ్మతుల కోసం రూ.1400 కోట్లు అవసరం అవుతుందని ఆ టవర్ యజమాని అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్