యూపీలోని రాయబరేలీలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హఫీజ్‌గంజ్‌లోని 85 ఏళ్ల వృద్ధురాలుపై రాకేష్ (35) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను చంపేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.