తండ్రి మరణాన్ని తట్టుకోలేక తొమ్మిదేళ్ల బాలిక ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్ర ఔరంగాబాద్ సమీపంలోని అహల్యానగర్ తాలూకా శిరేగావ్‌లో చోటుచేసుకుంది. బాలాసాహెబ్ జాదవ్ (38) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో నవంబర్ 29న కన్నుమూశారు. అయితే, అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన అతని కుమార్తె శ్రద్ధా జాదవ్ (9) ఆ మరుసటి రోజే మరణించింది. శ్రద్ధ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది.