టీమిండియాతో చేరిన గంభీర్

77చూసినవారు
టీమిండియాతో చేరిన గంభీర్
వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చిన భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు. అడిలైడ్‌లో ఉన్న టీమిండియాతో చేరాడు. తొలి టెస్టులో విజయానంతరం బీసీసీఐ అనుమతితో గంభీర్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. రెండో టెస్టుకు తప్పనిసరిగా అందుబాటులో ఉంటానని చెప్పి వెళ్లిన అతను తిరిగొచ్చాడు. ఇక, డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్‌తో రెండో టెస్టు జరగనుంది. ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్