తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించిన శ్రద్ధా ఆర్య కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసి ప్రకటించారు. గత నవంబర్ 29వ తేదీన తనకు ప్రసవం జరిగిందని తెలిపారు. పుట్టిన బిడ్డల్లో ఒకరు ఆడ, మరొకరు మగ బిడ్డ కావడం విశేషం. 2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో ‘కలవనిన్ కదలై’ అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక, తదితర సినిమాల్లో నటించారు.