ఒలింపిక్స్ ఛాంపియన్‌కు బ్రస్సెల్స్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాకు చెందిన బీఎంఎక్స్ ఫ్రీస్టైల్ ఛాంపియన్ లోగాన్ మార్టిన్ వాహనం బ్రస్సెల్స్‌లో దోపిడీకి గురైంది. దొంగలు ఆయన బ్యాక్‌ప్యాక్, వాలెట్‌ను దోచుకొన్నారు. ఈ ఘటనతో టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ అయిన లోగాన్ అవాక్కయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత మర్నాడు లోగాన్, అతడి సహచరులు కొన్ని బ్యాగ్‌లు, వస్తువులను సమీపంలోని బెంచ్ వద్ద గుర్తించారు.