వరుడు పదేపదే టాయిలెట్కి వెళ్తూ, వింతగా ప్రవర్తించడంతో మండపంలోనే వధువు పెళ్లిని రద్దు చేసుకున్న ఘటన దిల్లీలోని సాహిబాబాద్లో జరిగింది. వరుడి తీరుపై అనుమానం వచ్చి వధువు కుటుంబీకులు అతడిని ఫాలో అవ్వగా, అతను పెళ్లి వేదిక వెనుక స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు వెంటనే పెళ్లిని రద్దు చేసుకుంది. ఇరు కుటుంబాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.