వొడాఫోన్ ఐడియా(VI) ప్రీపెయిడ్ యూజర్ల కోసం సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత అపరిమిత డేటా అందివ్వనుంది. ఎంపిక చేసిన సర్కిళ్లలో ఈ ప్లాన్ అమలు చేయనుంది. రూ.365పైబడి రీఛార్జి చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు నెలలో రెండుసార్లు డేటా అవసరమైనప్పుడు 2జీబీ అదనపు డేటాను ఎలాంటి రీఛార్జి అవసరం లేకుండానే పొందొచ్చని వీఐ తెలిపింది.