ఏపీలో ఇటీవల ఏర్పాటైన ఈగల్ వ్యవస్థపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈగల్ వ్యవస్థను తీసుకువచ్చి గంజాయి వినియోగాన్ని పూర్తిగా నివారిస్తామని తెలిపారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలను పాడు చేసుకోవద్దని అన్నారు. ఒకసారి డ్రగ్స్ వ్యసనంలో పడితే తిరిగి మామూలు మనిషి కావడం కష్టమన్నారు. ఆ వ్యసనం సర్వనాశనం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి కూరగాయల్లా ఇంటి దగ్గరే పండించే స్థాయికి వచ్చారని చెప్పారు.