ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైరయ్యారు. చంద్రబాబు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారతారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, వైఎస్ జగన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. 25 వేల కేజీల డ్రగ్స్‌తో కంటైనర్ విశాఖకు వచ్చిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.