తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలకమైన యాదాద్రి పవర్ స్టేషన్‌లోని రెండో యూనిట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. అనంతరం వైటీపీఎస్ పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి పరిశీలించారు. నల్గొండ, దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద కృష్ణా నదికి సమీపంలో ఉన్న ఈ కేంద్రంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం ఐదు యూనిట్లను నిర్మిస్తున్నారు.