కోడెల అక్రమ అమ్మకాల వార్తలను ఖండించిన మంత్రి సురేఖ

60చూసినవారు
కోడెల అక్రమ అమ్మకాల వార్తలను ఖండించిన మంత్రి సురేఖ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. వేములవాడ ఆలయ కమిటీ మార్గదర్శకాల ప్రకారమే ఒక రైతుకు రెండు కోడెల చొప్పున ఇస్తున్నామన్నారు. సాధారణంగా తన వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలించాలని అధికారులకు సూచిస్తుంటామని.. కోడెల పంపిణీకి సంబంధించి వచ్చిన దరఖాస్తులను అదే విధంగా పంపించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్