బెంగళూరు రేవ్ పార్టీపై కేసు నమోదు

16477చూసినవారు
బెంగళూరు రేవ్ పార్టీపై కేసు నమోదు
బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేసి వాసు, అరుణ్, సిద్దిఖి, రణ్ ధీర్, రాజ్ లను డ్రగ్ పెడ్లర్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను FIRలో అధికారులు చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ సినీనటులు, రాజకీయ, వ్యాపార వేత్తలను పట్టుకున్నారు. MDMA డ్రగ్స్, గంజాయితో పాటు 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్