గ్యాస్‌ సిలిండర్‌ పేలి మూడేళ్ల చిన్నారి సహా భార్యాభర్తల మృతి

65చూసినవారు
గ్యాస్‌ సిలిండర్‌ పేలి మూడేళ్ల చిన్నారి సహా భార్యాభర్తల మృతి
గుజరాత్‌ రాష్ట్రంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు చెందిన వలస కూలీలు గ్యాస్ సిలిండర్ పేలడంతో మృతి చెందారు. గుజరాత్ రాష్ట్రం ముంద్రాలో ఈ దుర్ఘటన జరిగింది. ముంద్రాకు బతుకు తెరువు కోసం వెళ్లిన వలస కూలీలు లండ రవి (38), అతని భార్య లండ కవిత (31), కుమారై లండ జాహ్నవి (3)లు మృత్యువాత పడ్డారు. రవి టీ తాగడానికి గదిలో ఉన్న గ్యాస్ పొయ్యిని వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్