కుంభమేళాలో వీవీఐపీ పాసులు రద్దు

53చూసినవారు
కుంభమేళాలో వీవీఐపీ పాసులు రద్దు
ప్రయాగ్ రాజ్ సంగమంలో తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతి చెందగా.. 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వీవీఐపీ పాసులను రద్దు చేసింది. అలాగే పూర్తిగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది. వన్ వే రూట్ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 4 వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్