ఏదైనా సైట్ ఓపెన్ చేయగానే అందులో ఓ పక్కన ఆన్‌లైన్ రమ్మీ, క్యాసినో, రౌలట్ లాంటి గ్యాబ్లింగ్ ఆటలు అనేకం కనిపిస్తుంటాయి. వీటికి అట్రాక్ట్ అయి సరదాగా ఆడడం మొదలుపెడితే ప్రారంభంలో డబ్బులు వచ్చేలా చేసి ఆశ పుట్టిస్తారు. ఆ తర్వాత నాలుగైదుసార్లు డబ్బులు పోగొట్టుకుంటే.. ఒకటి, రెండు సార్లు డబ్బులు లాభం వచ్చేలా చేసి మళ్లీ ఆశ కల్పిస్తారు. ఇందులో లాభాలు రావడం కంటే నష్టపోయినవాళ్లే వేలాదిగా ఉంటారు.