గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసే విషయంలో గొడవ ఓ యువకుడి హత్యకు కారణమైంది. జోల్వా గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు రవి దూబే అనే యువకుడు వెళ్లాడు. ఈ క్రమంలో పెళ్లిలో డీజే వాయించడానికి వచ్చిన యువకులకు రవిదూబేకు మధ్య గొడవ జరిగింది. దీంతో వారు ఒక్కసారిగా కత్తి తీసి రవిదూబేను పొడిచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.