బీరు క్యాన్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించడంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాకు చెందిన రివోర్ట్ సంస్థ మహాత్ముడి చిత్రంతో పాటు, ‘మహాత్మ జి’ అనే పేరును కూడా ముద్రించి బీర్ క్యాన్లను విక్రయిస్తోంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు సదరు కంపెనీపై మండిపడుతున్నారు. మహాత్ముడికి.. ఆల్కహాల్‌తో సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆ చిత్రాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.