సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తూనే దడుసుకుంటాం. అలాంటిది పైథాన్‌ను చూస్తే.. ఇంకేమైనా ఉందా..? పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక తాజాగా ఇంటర్నెట్‌లో పైథాన్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి హాయిగా నేలపై నిద్రపోతుంటే.. బయట నుంచి వచ్చిన ఓ భారీ కొండచిలువ ఏకంగా అతడిపైకెక్కింది. అతడు కళ్లు తెరిచి చూడగా.. తన కళ్ల ముందు పైథాన్ ఉండడంతో అక్కడి నుంచి పరిగెత్తాడు. మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.