బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ నిర్వహించారు. మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం వేలాదిమంది వీధుల్లోకి వచ్చారు. చటోగ్రామ్‌లో సనాతన జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ క్రమంలో తాత్కాలిక ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచారు. వాటిని నెరవేర్చేవరకు వీధుల్లో తమ నిరసన కొనసాగుతుందని కొందరు హిందూ ఉద్యమకారులు పేర్కొన్నారు. అయితే ఎన్నికల జరిగే వరకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది.