కాంగ్రెస్ పార్టీ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే టీవీ చర్చల్లో పాల్గొనాలని నిర్ణయించింది. I.N.D.I.A కూటమి సమావేశంలో దీనిపై అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌లో పాల్గొనడానికి అనుకూల, వ్యతిరేక అంశాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం జరిగిందన్నారు. వీటిని బీజేపీ ప్రీఫిక్స్‌డ్ ఎగ్జిట్ పోల్స్‌గా ఆయన అభివర్ణించారు.