మద్యం సీసాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడిన జనం

73చూసినవారు
మద్యం సీసాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడిన జనం
TG: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఆగివున్న లిక్కర్ కంటైనర్ను వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. దీంతో లిక్కర్ బాటిళ్ల లోడ్ తో ఉన్న లారీ బోల్తా పడింది. గురువారం ఆ కంటైనర్‌ హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో కంటైనర్‌లోని మద్యం సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ఇది చూసిన వాహనదారులు, జనం మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. అందినకాడికి ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్