చూస్తుండగానే కాలిపోయిన లారీ

76చూసినవారు
చూస్తుండగానే కాలిపోయిన లారీ
AP: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే గన్నీ సంచుల లోడ్‌తో వెళ్తున్న లారీ అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు జాతీయ రహదారిపై లారీ వెళ్తోంది. అయితే తిమ్మంపల్లి సమీపంలో ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో డ్రైవర్ లారీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్