భర్తను ముక్కలుగా నరికిన ఘటన.. జైలులో భార్య వింత డిమాండ్

68చూసినవారు
భర్తను ముక్కలుగా నరికిన ఘటన.. జైలులో భార్య వింత డిమాండ్
యూపీలోని మీరట్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ దారుణ హత్య సంచలనం రేపింది. మార్చి 04న సౌరభ్ ని అతడి భార్య ముస్కాన్, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి హత్య చేసి.. మృత దేహాన్ని ముక్కలుగా నరికారు. ఈ కేసులో నిందితులిద్దనిరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే, వీరిద్దరు జైలులో డ్రగ్స్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ లేనిదే ఆహారం తీసుకోమని చెబుతున్నట్లు జైలు వర్గాల సమాచారం.

సంబంధిత పోస్ట్