రాజస్థాన్‌లోని జైపూర్‌లో అమానుష ఘటన వెలుగు చూసింది. బాలికను నమ్మించి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మాట్లాడాలని చెప్పి బాలికను కేఫేకు రమ్మన్నాడు. బాలిక కేఫేకు వెళ్లగా అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై ఆ దారుణాన్ని వీడియో దీసి బాలికను బ్లాక్ మెయిల్ చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.