ఆసుపత్రిలో చేరిన అల్లు అరవింద్ తల్లి కనకరత్నం

81చూసినవారు
ఆసుపత్రిలో చేరిన అల్లు అరవింద్ తల్లి కనకరత్నం
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, నటుడు అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నం ఆస్పత్రిలో చేరారు. 95 ఏళ్ల వయసున్న ఈమెకు గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను కుటుంబీకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్