ఉత్తరప్రదేశ్‌లో ఘోర సంఘటన జరిగింది. హిందూ యువకుడితో సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ హసీన్ అనే వ్యక్తి తన 16 ఏళ్ల సోదరిని గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన మీరట్‌లో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై జనాలు చూస్తుండగానే ఆమెపై దాడి చేసి గొంతుకోసి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే, పోలీసులు వచ్చే వరకు ఆమె మృతదేహం సుమారు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే పడి ఉందని మీడియా కథనాలు తెలిపాయి.