AP: విశాఖలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సీతయ్య అనే వ్యక్తి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను గర్భవతిని చేశాడు. ఈ ఏడాది జనవరిలో ఓ ఇంటికి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి అనుమానంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించగా, గర్భవతి అని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.