బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇవాళ ఆమె బెయిల్ పిటిషన్‌పై బెంగళూరులోని సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. ఆమెకు ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న రన్యారావును అధికారులు విచారిస్తున్నారు. అయితే.. బెయిల్ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.