ఇండోనేషియాలోని పపువాలో భారీ
భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 10.46 గంటలకు సంభవించిన ఈ
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది.
భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. ఇండోనేషియా వాతావరణ విభాగం సునామీ ప్రమాదం లేదని, అయితే మరింత ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల భూకంప తీవ్రత 6.3, 6.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.