హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కాసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కృష్ణాస్ కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.