స్కూల్‌లో హిందూ విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన ముస్లిం విద్యార్థి.. ఉదయపూర్‌లో 144 సెక్షన్

76చూసినవారు
స్కూల్‌లో హిందూ విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన ముస్లిం విద్యార్థి.. ఉదయపూర్‌లో 144 సెక్షన్
రాజస్థాన్ ఉదయపూర్ జిల్లాలో తాజాగా దారుణ ఘటన జరిగింది. భాటియాని చోహట్టాలోని ఓ పాఠశాలలో హిందూ విద్యార్థిని, 10వ తరగతి చదువుతున్న ముస్లిం విద్యార్థి కత్తితో పొడిచి చంపేశాడు. దీంతో ఉదయపూర్‌లో మతపరమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనల మధ్య పలు వాహనాలకు నిప్పుపెట్టడంతో నగరంలో 144 సెక్షన్ విధించారు. ఉదయపూర్ జిల్లా కలెక్టర్ అరవింద్ పోస్వాల్ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్