ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధకులు యూపీలోని దుధ్వా టైగర్ రిజర్వ్‌లో అరుదైన తెల్లటి కప్పను గుర్తించారు. లూసిజం వల్ల కళ్లు తప్ప శరీరం మొత్తం తెల్లగా మారిందని వారు తెలిపారు. దేశంలో ఇలాంటి కప్ప కనిపించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. జన్యుపరమైన అంశాలు లేదా వాతావరణ మార్పుల వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.