IPO లాంచ్‌కు సిద్ధమైన స్విగ్గీకి వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. జొమాటో కంటే ముందే ఈ సంస్థ లాంచ్ అయినా ఆ సంస్థ జోరును స్విగ్గీ అందుకోలేకపోయింది. రెవెన్యూలో జొమాటో కంటే 23 శాతం వెనుకబడి ఉంది. ఫుడ్ డెలివరీ, క్విక్ ఆఫర్స్, ప్రాఫిట్ విషయంలో జొమాటో, స్విగ్గీకి చాలా తేడా ఉంది. ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో స్విగ్గీ కంటే 5.4 రెట్లు ఎక్కువ అర్జించింది. ఇబిటా కంటే ముందు వచ్చిన ఆదాయంలోనూ స్విగ్గీ వెనుకబడి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జొమాటో రూ.299 కోట్లు లాభాలు ఆర్జించగా.. స్విగ్గీ రూ.348 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.