మంత్రి పొంగులేటికి షాక్

1913చూసినవారు
మంత్రి పొంగులేటికి షాక్
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి. పొంగులేటికి సంబంధించిన రాఘవ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చారు. విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులు మొదలు పెట్టని సంస్థపై చర్యలు తప్పవు అంటున్నారు అధికారులు. ఏపీలోని ఈపీడీసీఎల్ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1,194 కోట్లతో టెండరును దక్కించుకున్న పొంగులేటికి చెందిన రాఘవ నిర్మాణ సంస్థకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వెంటనే పనులు మొదలుపెట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్