36 విమానాలను రద్దు చేయించిన ఒక్క కత్తెర

83చూసినవారు
36 విమానాలను రద్దు చేయించిన ఒక్క కత్తెర
ఎయిర్‌పోర్టులో కత్తెర మిస్సవ్వటంతో ఏకంగా 36 విమానాలు రద్దు, 201 విమానాలు ఆలస్యమైన ఘటన శనివారం జపాన్‌లో జరిగింది. హక్కైడోలో న్యూచిటోస్ ఎయిర్‌పోర్టు బోర్డింగ్ గేట్‌ సమీపంలోని ఓ షాపులో కత్తెర మయమైంది. దీంతో భద్రత దృష్ట్యా సిబ్బంది రోజంతా కత్తెర కోసం వెతికారు. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులతో చెకింగ్ పాయింట్ల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి. అయితే ఆ కత్తెర మరుసటి రోజు(ఆదివారం) అదే దుకాణంలో దొరకడం కొసమెరుపు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్