HYD: మెట్రో ఫేజ్-2లో భాగంగా ఓల్డ్ సిటీ మెట్రో రైల్ భూసేకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. MGBS - చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కావాల్సిన భూ సేకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే భూసేకరణ కోసం HYD మెట్రో నోటీసులు ఇచ్చింది. సీఎం ఆదేశాల మేరకు మెట్రో ఫేజ్-2 కారిడార్ VI MGBS నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు 200 ఆస్తులకు (100 LHS, 100 RHS) డిక్లరేషన్ ఇవ్వగా.. HYD కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి ఆమోదం తెలిపారు. కొత్త సంవత్సరంలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానున్నాయి.