తమిళనాడులోని తిరుపత్తూరు హైవేపై ఒక్కసారిగా వరద రావడంతో రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలు అన్ని కొట్టుకుపోయాయి. తిరుపత్తూరు జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురవగా వాహనదారులు బస్టాండ్ సమీపంలోని హైవే పై బస్సులు, కార్లు పార్క్ చేశారు. అర్ధరాత్రి వచ్చిన వరదలకు వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో బస్సుల యజమానులు గొల్లుమంటున్నారు.