ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరానికి చెందిన సీపీ ట్యాంక్ ప్రాంతంలోని ఓ భవనంలో ఆదివారం భారీగా మంటలు చెలరేగాయి. ఒక భవనం నుంచి మంటలు మరొక భవనానికి అంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు.