పర్యాటకులను ఆకర్షిస్తున్న జలపాతం (వీడియో)

64చూసినవారు
కర్ణాటక బెలగావి జిల్లాలోని ఘటప్రభ నదిపై ఉన్న గోకాక్ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. భారత్ నయాగరా జలపాతంగా దీనికి పేరుంది. ఇది గోకాక్ పట్టణం నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. వేసవిలోనూ జలపాతం పొంగిపొర్లుతోంది. ఘటప్రభ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో జలపాతంలో నీటి శోభ సంతరించుకుంది. దీనిని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్