యూపీలోని హరిద్వార్‌లో కన్వర్ యాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిద్వార్‌లోని అన్ని పాఠశాలలకు వారం పాటు సెలవు ప్రకటించారు. జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు స్కూళ్లను బంద్ చేయనున్నారు. యాత్రలో పాల్గొనే శివభక్తుల సంఖ్య పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ధీరజ్ సింగ్ గర్బ్యాల్ తెలిపారు.