అదానీ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో నిల్చొని.. సమావేశాలకు హాజరైన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు గులాబీలు, జాతీయ జెండాలను అందించారు. అదే సమయంలో వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా రాహుల్ గులాబీని, జాతీయజెండాను ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.