తిమింగలం తన ఆడ తోడు కోసం ఏకంగా మూడు సముద్రాలు దాటి ప్రయాణం చేసింది. ఈ రికార్డ్ స్థాయి వలస ప్రయాణాన్ని బజారుటో సెంటర్ ఫర్ సైంటిఫిక్ స్డడీస్ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఏఐ అల్గారిథం సాయంతో ఫొటో రికార్డింగ్ చేసి వివరాలు వెల్లడించారు. ఇక్కడ మగ తిమింగలం తగిన తోడు కోసం వెతుక్కుంటూ కనీసం 13,046 కి.మీ ప్రయాణించినట్టుగా గుర్తించారు. కొలంబియాలోని గల్ఫ్ ఆఫ్ ట్రిబుగా నుంచి ఈ తిమింగలం వలస ప్రయాణం ప్రారంభించింది.