భర్త కళ్లముందే చనిపోయిన భార్య

1047చూసినవారు
భర్త కళ్లముందే చనిపోయిన భార్య
సాఫ్ట్‌వేర్‌ దంపతుల విహారయాత్ర విషాదం నింపింది. భర్త కళ్లముందే పారాగ్లైడింగ్‌ చేస్తున్న భార్య ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన సాయి మోహన్, నవ్య (26) దంపతులు హిమాచల్ ప్రదేశ్ లోని కులూ వెళ్లారు. నవ్య పారాగ్లైడింగ్ చేస్తుండగా పైలట్ అజాగ్రత్త వల్ల సీట్ బెల్ట్ సరిగా చూసుకోకపోవడంతో ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయింది. కాగా సోమవారం రాత్రి మృతదేహాన్ని విమానంలో శంషాబాద్‌ ఏయిర్‌పోర్టుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్