ప్రియురాలు లవ్ రిజెక్ట్ చేసిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన పులి మాదిరి క్రాంతి(25) అనే యువకుడు కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. కొంతకాలంగా క్రాంతి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కొద్దిరోజుల క్రిందట ఆమె ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెందాడు. బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.