హైదరాబాద్ పాతబస్తీలో బురఖా ధరించి బైక్‌పై స్టంట్స్ చేసిన దానిష్ అనే యువకుడితో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 15న ఈ ఘటన జరగ్గా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని సుమోటోగా స్వీకరించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా, ద్విచక్రవాహనం నెంబర్ ను గుర్తించి నిందితుల ఆచూకీ కనిపెట్టారు.