ఏపీలోని అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నిరుద్యోగి అయిన యువతి ఉద్యోగం కోసం ఓ కన్సల్టెన్సీకి రూ.2 లక్షలు చెల్లించింది. అయితే వారు మోసం చేయడంతో మనస్థాపం చెందిన యువతి బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.